అసాధారణ విజయానికి ధారణ చేయాల్సిన నైపుణ్యాలివే!

Image

1. కార్యాలయంలో నీతి నియమాలు:

ప్రతి ఉద్యోగి తనకు ఉద్యోగమిచ్చిన సంస్థకు, పూర్తిగా ఎనిమిది గంటల పనిని చిత్తశుద్ధితో, నిబద్ధతతో చేయాలి. దీనితోపాటు పర్యవేక్షకుని సూచనలు తు.చ. తప్పకుండా పాటించాలి.

2. మంచీ, మర్యాద, మన్నన :

ఎదుటివారితో మర్యాదగా ప్రవర్తించాలి. ‘దయచేసి, ‘కృతజ్ఞతలు, మన్నించాలి, ఏదయినా సహాయం కావాలా వంటి మర్యాదపూర్వకమైన ప్రవర్తనను అలవరచుకోవాలి. ముఖ్యంగా మన సేవలు, ఉత్పత్తుల వినియోగదారులతోనూ, పర్యవేక్షకులతోనూ, సాటి ఉద్యోగస్తులతోనూ మర్యాదగా ప్రవర్తించడం మంచి భవిష్యత్తుకు పునాది అవుతుంది.

3. ఒకే బృందం, ఒకే లక్ష్యం:

ఒకే బృందంగా, సాటి బృంద సభ్యులతో కలివిడిగా ఉంటూ పని చేయాలి. పనిలో బాధ్యతలను సమదృష్టితో పంచుకోవడం, ఎదుటివారి మాటలకు సానుకూల వైఖరితో స్పందించడం, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం, ఎదుటివారు తమ పనిని సక్రమంగా చేయడానికి సహకరించడం, అవసరమైనప్పుడు సహాయాన్ని కోరడం – మంచి బృంద సభ్యులకుండవలసిన లక్షణాలు.

4. క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం:

చక్కని పనితనంతో పనిని పూర్తి చేయడానికి, పనికి సంబంధించిన పనిముట్లను, కాగితాలను చక్కగా ఏర్పాటు చేసుకోవడం, అనుభవం ద్వారా నేర్చుకోవడం, తెలియని విషయాలు అడిగి తెలుసుకుని, తప్పులు సరిదిద్దుకోవడం, విమర్శలను, సూచనలను, అపజయ భావన, అవమాన భావన, ప్రతిఘటన లేకుండా స్వీకరించడం – చక్కని క్రమశిక్షణకు, ఆత్మ విశ్వాసానికి ప్రతీకలు. 

5. కార్యాలయ నియమాలను పాటించడం:

చక్కని ఆహార్యం అంటే చూడ ముచ్చటైన దుస్తులు ధరించడం, సత్ప్రవర్తన, చక్కని దేహ భాష, సున్నితమైన కంఠం, పని చేసే ప్రాంతానికి అనుగుణమైన పద సంపద అభివృద్ధి చేసుకోవడం వంటి కనీస కార్యాలయ నియమాలను తప్పకుండా పాటించాలి.

6. భాషా జ్ఞానమే విజయానికి తొలి మెట్టు!

వ్యాపార భాష స్థాయిలో, ఆంగ్లంలో చదవడం, వ్రాయడం, మాట్లాడటం అలవరచుకోవాలి. ఈ సామర్ధ్యాలను పెంపొందించుకున్నవారికి ఎటువంటి ఉద్యోగంలోనైనా అభివృద్ధికి తిరుగులేదు.

మొత్తం అరవై నైపుణ్యాలున్న సరళ కౌశలాల జాబితాలో కనీసం ఈ ఆరింటిని నిరంతర సాధనతో అభివృద్ధి చేసుకుంటే, అనితర సాధ్యమైన విజయం మీకు కరతలామలకమవుతుంది. మీ సొంతమవుతుంది.

ఒక అమెరికన్ వెబ్ సైట్ ప్రకారం ఈ అరవై సరళ కౌశలాల జాబితా చూడండి. ఆశ్చర్యం, జ్ఞానం రెండూ ఒకేసారి కలుగుతాయి మీకు!  శుభం!

http://www.rediff.com/getahead/2007/jan/08soft.htm 

 

About challaramaphani

An individual with a progressive attitude.
This entry was posted in Uncategorized and tagged , , , , , . Bookmark the permalink.

2 Responses to అసాధారణ విజయానికి ధారణ చేయాల్సిన నైపుణ్యాలివే!

  1. bandi says:

    good effort sir

  2. Oka manishi jeevitam lo yedugu dalali kavalasina annintini inta chakkaga wrayadam chala great sir….

Leave a comment