నిపుణ సంభాషణం – విజయ సోపానం

Image          

కమ్యూనికేషన్ స్కిల్స్ అని మనం తరచూ తెగ ఉటంకిస్తూ ఉంటాం! వ్యక్తిత్వ వికాస నిపుణులకు, ఉద్యోగాలిచ్చేవారికి మాట నాలుక మీద నాట్యం చేస్తుంటుంది. ఇదే వారి వ్యాపార విజయానికి తారక మంత్రం! అబ్బే! వాడికి కమ్యూనికేషన్ స్కిల్స్ లేవండీ, ఉద్యోగం కొంచెం కష్టమే అని నాలుక చప్పరించేస్తారు! దానితో మనం చప్పబడిపోతాం! ఇన్ని మార్కులొచ్చినా ఇంకా మనకేమిటో లేదంటాడేమిట్రా బాబూ అని దిగాలు పడిపోతాం! అదే నైపుణ్యాలకున్న శక్తి! అదే కమ్యూనికేషన్ స్కిల్స్ మహత్మ్యం! అతిగా ఉన్నా ప్రమాదమే! అతి తక్కువగా ఉన్నా ప్రమాదమే! సమతుల్యత, నియంత్రణ సాధించడమే నిజమైన కమ్యూనికేషన్ స్కిల్. ఎక్కడ తక్కువ మాట్లాడాలో, ఎక్కడ ఎక్కువ మాట్లాడాలో తెలిసి మసలుకోవడమే కమ్యూనికేషన్ స్కిల్. కేవల జ్ఞానం ఉంటే సరిపోదు. అది నలుగురికీ పంచగలిగే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. నైపుణ్యాలను సానుకూల వైఖరితో, నలుగురినీ ప్రభావితం చేసే విధంగా వినియోగించడం అభ్యసించాలి. నిరంతర అధ్యయనం చేయాలి. అభ్యాసము కూసు విద్య అననే అన్నారు  కదా!

Communication is a skill which will thrill you, if you use it with skill; otherwise it will kill you!  మాటే మనుషుల మధ్య రణానికీ, మరణానికీ కూడా కారణమవుతుంది. నైపుణ్యంతో సంభాషిస్తే అనుకున్న పనులైపోతూ, ఉత్సాహం  కలుగుతుంటుంది. భలే చేశాం అనిపిస్తుంటుంది. సంభాషణా నైపుణ్యం మన వ్యక్తిత్వాన్ని ప్రతిఫలిస్తూ ఉంటుంది. మన సంభాషణా నైపుణ్యమే మన విజయాల స్థాయిని, శీలాన్ని ప్రతిబింబిస్తూ ఉంటుంది. అందుకే, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంటారు పెద్దలు! ఊరేమిటి, ప్రపంచమే మంచిదవుతుంది. అందుకే వేమన, సజ్జనుండు పల్కు చల్లగాను అంటాడు! సజ్జనుడైనవాడు చల్లగా పలకాలి. సౌమ్యంగా మాట్లాడాలి. ఎందుకు?  పనులన్నీ మనకు కావలసినట్టు చక్కబెట్టుకోవడానికి! Communication is nothing but dissemination of information to get the things done either in workplace or in daily life. మనం ఒక కంపెనీలో మేనేజర్ అయితే సరస సంభాషణా నిపుణ చాతుర్య విద్య చక్కగా అక్కరకొస్తుంది. ఒక పనిని చక్కబెట్టే మామూలు మేనేజర్ స్థాయి నుండి మనల్ని నాయకత్వ స్థాయికి తీసుకెళుతుంది! నాయకత్వం కావాలంటే, సంభాషణా నైపుణ్యంతో పాటు, అనితర సాధ్యమైన ఓర్పు, సిబ్బందిని పర్యవేక్షించడంలో సుశిక్షితమైన నేర్పు ఉండాలి. ఇవి లేనప్పుడు కేవలం మేనేజర్ గానే మిగిలిపోతారు! మేనేజర్ అంటే కేవలం నియమ నిబంధనలు పాటిస్తూ, సిబ్బందిని పర్యవేక్షించేవాడు మాత్రమే! మరి నాయకుడు, అవసరమైతే సానుకూల చొరవ తీసుకుని, సిబ్బంది నిర్వహణకు, సంక్షేమానికి అడ్డంకిగా ఉన్న నియమ నిబంధనల బంధనాలను సునాయాసంగా ఛట్ ఫట్ మంటూ తెంపేస్తాడు. అటువంటి వాడే సంస్థలోనైనా, దేశంలోనైనా నాయకుడవుతాడు! ఇటువంటి నాయకత్వానికి అద్భుతమైన తిరుగులేని పునాది కమ్యూనికేషన్ స్కిల్స్! అంటే నిపుణ సంభాషణం

మాట – విజయానికి రాచబాట

మాట మనిషికి చిరునామా! మాట మనిషిని పట్టిస్తుంది! మాట మనిషికి ఉనికినిస్తుంది. ఉన్నతినిస్తుంది. ఉన్న స్థానాన్నుంచి ఉన్నత స్థానానికి తీసుకెళుతుంది.మాట మనిషి జాతకాన్ని మార్చేస్తుంది. మాట మనిషిని పాతాళానికి తొక్కేస్తుంది.ఆకాశానికి ఎత్తేస్తుంది. లోకం చుట్టిన వీరుణ్ణి చేస్తుంది. అటువంటి మాట మనిషి సంభాషణా నైపుణ్యానికి, (Conversational Skills) సమాచార వితరణకు  (dissemination of information) ఆయువు పట్టు! ఆటపట్టు! విజయానికి తొలి మెట్టు! విజయశిఖరాలు చేర్చే విహంగం!

సమాచారాన్ని నైపుణ్యంతో ఎదుటివారికి నొప్పింపక, తా నొవ్వక అన్నట్టు  తెలియచేయడానికి మాట ఒక్కటే రాచ బాట! మహోన్నత విజయాలు, అనితర సాధ్యమైన జీవన సాఫల్య శిఖరాలు  అధిరోహించిన వారు మాటల రెక్కల విమానాన్నే వాహనంగా చేసుకుని చరిత్ర సృష్టించారు. అందుకే నిర్ద్వంద్వంగా అందరూ చెప్పే మాట ఒక్కటేవ్యక్తిగత జీవితంలోనైనా, వృత్తిగత జీవితంలోనైనా విజయం సాధించాలంటేకమ్యూనికేషన్ స్కిల్స్అనివార్యం! మరి ఇలా మాట్లాడే నైపుణ్యాన్ని ఎలా సొంతం చేసుకోవాలి? ఎలా నేర్చుకోవాలి?

సానుకూలవైఖరిసంభాషణాచాతురి

మీ సమాచార వితరణా నైపుణ్యం మీ వైఖరిని తెలియచేస్తుంది. మీ సానుకూల వైఖరిని మాటల్లో పట్టిస్తుంది. అందుకే మీ వైఖరి, కమ్యూనికేషన్ స్కిల్ సమాంతరంగా, మీ విజయాల రైలుకు పట్టాల్లా పని చేస్తాయి. ఇవి రెండూ పాలూ నీళ్ళలా కలవకపోతే మీకు విజయం ఆమడ దూరంలో ఉంటుంది. అపజయం ఎప్పుడూ పలకరిస్తూనే ఉంటుంది. మీ మాట మీ వైఖరికి వెన్నుదన్నుగా నిలుస్తుంది. మీ మాటలో మీ వైఖరి తెలుస్తుంది. ఉదాహరణకుమీ నాన్నగారు ఇంట్లో ఉన్నారా? ‘ అని పిల్లవాణ్ణి అడిగితే, ‘ఉన్నారండీ! రండి, కూర్చోండిఅంటాడు! ‘మీ అయ్య ఇంట్లో ఉన్నాడేరాఅంటే, ‘ఉన్నాడ్రా! రా కూర్చోఅంటాడు. మనం విధంగా పలకరిస్తే, ఎదుటివారు కూడా అదే విధంగా స్పందిస్తారు. సానుకూల వైఖరికి, సంభాషణా చాతురికి సంబంధమేమిటో చూద్దాం!

1.    సానుకూల సమాచార వితరణా వైఖరి (Positive Communication)

2.    చొరవ తీసుకునేందుకు దోహదం చేసే సంభాషణా వైఖరి (Proactive Communication)

3.    ఉత్పాదక సంభాషణా వైఖరి (Productive Communication)

4.    సాఫల్య సంభాషణా వైఖరి (Progressive Communication)

మీరు మాట్లాడే వైఖరి సానుకూలంగా ఉంటే ఎదుటివారు కూడా సానుకూలంగానే స్పందిస్తారు. అలా మీరు మాట్లాడగలిగితే అది మీరు ఒక పని కావడానికి చొరవ తీసుకునే సంభాషణా వైఖరి అవుతుంది. ఎప్పుడైతే చొరవ తీసుకుని పని అయ్యేలా మీ సంభాషణా చాతురిని ఉపయోగించారో, అప్పుడు అది మీ ఉత్పాదక సంభాషణా వైఖరిని ప్రతిఫలిస్తుంది. అంటే ఒక వస్తువును ఉత్పత్తి చేయడానికి గానీ, సేవలను అందచేయడానికి గానీ మీరు మీ సంభాషణా చాతుర్య వైఖరిని వినియోగిస్తున్నారన్నమాట! ఎప్పుడైతే మీ సంభాషణా చాతుర్యం ఉత్పాదక వైఖరికి తోడయ్యిందో, అంటే ఒక పని జరిగేందుకు దోహదం చేసిందో, అప్పుడు అది మీ సాఫల్య సంభాషణా వైఖరిని ప్రతిబింబిస్తుంది. ఒక పనిని సానుకూలంగా పూర్తి చేయడంలో మీ సంభాషణా నైపుణ్య వినియోగ ప్రతిభను నలు దిశలా చాటుతుంది. ఇదేకమ్యూనికేషన్ స్కిల్స్మనం సాధించామనడానికి విస్పష్ట నిదర్శనం. అప్పుడు మీకు వ్యక్తిగత జీవితంలోను, వృత్తిగత జీవితంలోను డిమాండ్ పెరుగుతుంది. మీరు చేరే విజయ తీరాలకు అంతులేని వారధి ఏర్పడుతుంది. మీరు గమనించారో లేదో గానీ, పైన attitude అని ఉండాల్సిన చోట ‘కమ్యూనికేషన్’ అని మార్చాను. అంటే మీ సానుకూల వైఖరి, మీ సంభాషణా చాతురి సమానార్ధకాలు. అంటే రెండింటికీ  ఒకటే అర్ధం. ఏది సరిగా లేకపోయినా జరిగే అనర్ధం వల్ల వృత్తిగత జీవితమే కాక, వ్యక్తిగత జీవితం కూడా ప్రమాదంలో పడుతుంది. మరి పరిష్కారం? పద్యాన్ని మననం చేసుకుంటూ ఆచరణలో పెట్టడమే. అల్పుడెపుడు పలుకు ఆడంబరముగాను; సజ్జనుండు పలుకు చల్లగాను; కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా; విశ్వదాభిరామ వినురవేమ! ఇదే కమ్యూనికేషన్ స్కిల్స్ సారాంశం!

About challaramaphani

An individual with a progressive attitude.
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s