ఇంతకీ ఏమిటీ సరళ కౌశలాలు ?

Image

 

సరళ కౌశలాల నిర్వచనం

ఒక ఉద్యోగం సమర్ధవంతంగా చేయడానికి అవసరమైన నైపుణ్యాలే సరళ కౌశలాలు (Soft Skills). ఆ నైపుణ్యాల ద్వారా ఆశించే ఫలితాలు, ఆ ఫలితాలు సాధించడానికి అనుసరించే పద్ధతులు మాత్రం వేర్వేరుగా ఉంటాయి. నిజానికి ఒక రంగంలో పనితనం ప్రదర్శనకు ఒక నిర్దుస్టమైన ప్రారంభం, ముగింపు ఉండవు.  ఉదాహరణకు మార్గనిర్దేశం (Counseling), పర్యవేక్షణ (Supervision), కార్య నిర్వహణ (Managing).

ఈ రోజుల్లో,  విస్తృత పోటీ ఉన్న ఉద్యోగ విపణి (Job Market) లో కనీస ఆమోదాన్ని పొందే నైపుణ్యాల స్థానాన్ని, అత్యున్నత ప్రమాణాలు గల నైపుణ్యాలు ఆక్రమించాయి. ఈ అత్యున్నత ప్రమాణాలు గల నైపుణ్యాలనే సరళ కౌశలాలు (Soft Skills) అంటున్నారు.

ఈ సరళ కౌశలాలు (Soft Skills) అనేవి వ్యక్తిగత ప్రవర్తనా లక్షణాలు, నైపుణ్యాలకు సంబంధించినవి. వీటిలో ముఖ్యమైనవి ఆయా వ్యక్తులకే ప్రత్యేకమైన వ్యక్తిత్వ లక్షణాలు, ఇవి సాంఘిక మర్యాదలు, భాషా సౌలభ్యం, వ్యక్తిగత అలవాట్లు, స్నేహశీలత, ఆశావాదం మొదలైనవి. ఈ లక్షణాలన్నీ మనందరికీ ఒక ప్రత్యేకతను కల్పిస్తూ, మనందరిలో వివిధ స్ఠాయిలలో ఉంటాయి. ఈ లక్షణాలను ఉన్నత ప్రమాణాలతో కలిగి ఉన్నవారిని,  కంపెనీలు ఉద్యోగంలోకి తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తాయి.

బంగారు పళ్ళేనికైనా గోడ చేర్పు కావాలి!

ఒక ఉద్యోగానికి అవసరమైన కనీస సాంకేతిక విద్యార్హత బంగారు పళ్ళెమైతే, ఆ పళ్ళేనికి గోడ చేర్పులాంటివి సరళ కౌశలాలు. ఎంతటి బంగారు పళ్ళెమైనా గోడ చేర్పు లేకపోతే నిలబడలేదు. అలాగే ఎంతటి ఉన్నత విద్యార్హతలున్నా, సత్ప్రవర్తన, సరళ కౌశలాలు లోపిస్తే ఆ వ్యక్తి సాధించిన వృత్తిగత ప్రగతి కానీ, వ్యక్తిగత ప్రగతి కానీ రాజుగారి దేవతా వస్త్రాల్లాగా అభాసుపాలవుతాయి.

ImageImage

సరళ కౌశలాలు (Soft Skills)  vs. విద్యార్హతలు (Hard Skills)  

ఉద్యోగానికి అవసరమైన కనీస సాంకేతిక విద్యార్హతల్లోనూ (Hard Skills), సరళ కౌశలాల్లోనూ (Soft Skills),  అసమాన ప్రతిభ కనబరచినవారికి  కంపెనీలు ఎర్ర తివాచీ పరుస్తాయి. కానీ, ఇటీవల ఈ విషయాలపై ఒక సర్వే నిర్వహించి, నివేదిక వెలువరించిన అంతర్జాతీయ సంస్ఠ అధ్యయనం ప్రకారం సాంకేతిక నైపుణ్యాల గురించి ఉద్యోగార్ధులెవరూ బెంగ పడాల్సిన అవసరం లేదు. సమయ పాలన అంటే సమయానికి కార్యాలయానికి చేరుకోవడం, బృందాలతో కలసి పని చేయడం, పర్యవేక్షణను గౌరవించడం – ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి.

అద్భుతమైన అర్హతలుండీ, అంతగా ఆమోదయోగ్యం కాని సరళ కౌశలాలు ఉన్నవారికన్నా, చొరవ, స్నేహశీలత, సర్దుబాటు తత్వం ఉన్నవారికి రిక్రూటర్లు ఉద్యోగం ఇవ్వడానికి ఇష్టపడతారు. కంటికింపైన,  ఉద్యోగానికి తగిన వస్త్రధారణ సానుకూల స్పందన కలిగిస్తుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు.

 కుటుంబ వాతావరణం – సరళ కౌశలాలు

సరళ కౌశలాలలో శిక్షణ ఇవ్వడానికి సులువైన మార్గమేమీ లేదు. బాల్యంలోనే,  కుటుంబ వాతావరణంలో వీటికి పునాది పడుతుంది. దీనికి తోడు వివిధ సందర్భాలలో అవసరమైన నైపుణ్యాలను పసిగట్టగలిగే సామర్ధ్యాన్ని పెంపొందించుకోవాలి. జీవితంలో అత్యున్నత విజయాలు సాధించిన మన చుట్టూ ఉన్నవారిని పరిశీలిస్తూ, కొత్త విషయాలను చక చకా నేర్చుకోవాలి.

అహంకారాన్ని వదిలితేనే విజయలక్ష్మి వరిస్తుంది !

సరళ కౌశలాలలో ఉన్న లోపాలపై విమర్శించడం చాల కష్టం. ఎందుకంటే అవి ఒక వ్యక్తి అహంకారానికి సంబంధించిన కౌశలాలు. నేనెందుకు చెయ్యాలి? నేనే ఎందుకు చెయ్యాలి అన్న చిన్న అహంకారం తలెత్తితే చాలు; జీవితం నాశనం కావడానికి! రిక్రూటర్లు ఒక అభ్యర్ధిని తిరస్కరించినప్పుడు, వారిలోని సరళ కౌశల (ప్రవర్తనా) లోపాలను ఎత్తి చూపించడానికి ఇష్టపడరు. అనవసరమైన మరేదో వ్యాఖ్యానం చేసి తప్పించుకుంటారు. ‘ఫలానా కంపెనీ నన్ను తిరస్కరించింది.  ఎందుకంటే వాళ్ళు సైన్సు పట్టభద్రులను తీసుకోవదంలేదట’ అని ఒక అభ్యర్ధి అంటే అది నిజం కాదని అతనికి కూడా తెలుసు. ‘నీ కమ్యూనికేషన్ స్కిల్సు బాగా లేవు; నీలో మరేదో ప్రతికూల ప్రవర్తనా లక్షణాలున్నాయి’ అని చెప్పడం కన్నా, నీలాంటి డిగ్రీ ఉన్నవాళ్ళని ఇప్పుడు తీసుకోవడంలేదని చెప్పడం కంపెనీలకు తేలిక కదా! ఇటువంటి ప్రవర్తన వలన ఎంతటి గొప్ప అర్హతలున్నా, నిష్ప్రయోజనమే కదా! అందుకే చిన్న చిన్న కీలక విషయాలు మనం పట్టించుకుంటే, పెద్ద వ్యవహారాలు అవే దారికొస్తాయంటారు పెద్దలు. ఇప్పటికైనా సరళ కౌశలాల మీద దృష్టి సారించండి నేస్తాలూ!

ఇప్పుడు ఈ సరళ కౌశలాలలో, ఉద్యోగం సాధించడానికి అవసరమైన, అతి ముఖ్యమైన ఉద్యోగ నైపుణ్యాలేమిటో చూద్దాం!

About challaramaphani

An individual with a progressive attitude.
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s