వ్యక్తిగత వికాసం నుండి వ్యక్తిత్వ వికాసం వైపు!

Image
 
వ్యక్తిత్వ వికాస విశ్వంలోకి సుస్వాగతం!     లక్ష్య శుద్ధి మూలధనంగా… ! 
 
ప్రాచీన సంప్రదాయ పరిరక్షణలో, ఆధ్యాత్మిక సాధనలో, గురు పరంపరారాదనలో, దైవ చింతనలో, పాప చింతలో, అహింసా మార్గానుసరణలో, చివరకు ఆధునిక సాంకేతిక విద్యా రంగాలలో సైతం పురాతన కాలంనుండి నేటి దాకా  భారత దేశాన్ని ప్రపంచమంతా ‘గురుభూమి’గా భావిస్తోంది. వ్యక్తిత్వ వికాసమంటే ప్రపంచానికి గుర్తుకు వచ్చేది మన స్వామి వివేకానంద. అటువంటి వ్యక్తిత్వ వికాస మార్గంలో నేటి యువతను నడిపించేందుకు అంతర్జాలమే సాధనంగా మేము సాగించే చిన్ని ప్రయత్నానికి నాంది ఈ వ్యక్తిత్వ వికాసం.
 
ఒరులేయవి యొనరించిన 
నరవర తన కప్రియమగు తా
నొరులకవి చేయకునికి 
పరాయణము పరమ ధర్మ పథములకెల్లన్ !            …. ప్రవర్తనా నైపుణ్యాలు   

అడిగిన జీతంబియ్యని
మిడిమేలపు దొరను గొల్చి మిడుకుట కంటెన్
వడిగల యెద్దుల గట్టుక
మడి దున్నుకు బ్రతుక వచ్చు మహిలో సుమతీ!    … ఆత్మగౌరవం  

వినదగు నెవ్వరు చెప్పిన 
వినినంతనె వేగపడక వివరింపతగున్ 
కని కల్ల నిజము తెలిసిన
మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ!         …. లిజనింగ్ స్కిల్స్ 

అల్పుడెపుడు పల్కు ఆడంబరముగాను 
సజ్జనుండు పల్కు చల్లగాను
కంచు మోగునట్లు కనకంబు మోగునా 
విశ్వదాభిరామ వినుర వేమ!                           …. కమ్యూనికేషన్ స్కిల్స్ 

తప్పులెన్నువారు తండోపతండంబులు 
ఉర్విజనులకెల్ల ఉండు తప్పు 
తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు
విశ్వదాభిరామ వినుర వేమ!                           … తప్పులెన్ను నైపుణ్యాలు   
 
తొలి తెలుగు వాగ్గేయకారుడు తాళ్ళపాక అన్నమాచార్యులు,త్యాగరాజు, క్షేత్రయ్య, రామదాసు, భర్తృహరి, వేమన, సుమతి శతకకారుడు బద్దెన, అక్కమహాదేవి,కబీర్,  స్వామి వివేకానంద – వీరేకాక ఎందరో మహానుభావులు భరతజాతి వ్యక్తిత్వ వికాసానికి పునాదులు వేశారు. ప్రాత: స్మరణీయులైన వీరిని సభక్తికంగా తలచుకుంటూ మరిన్ని విశేషాలు ప్రస్తావించుకుందాం! ఉదరపోషణార్ధం నేర్చుకునేది, చెప్పేది వ్యక్తిత్వ వికాసం కాదు; కానేరదు. ఉదరపోషణార్ధం ఉపాధికోసం ఎటువంటి నైపుణ్యాలు నేర్చుకోవాలో ఈ బ్లాగులో ప్రస్తావించుకుందాం!  
ఉద్యోగులు, విద్యార్ధులకు కూడా ఉపయుక్తంగా ఉండే నైపుణ్యాలు ఏమిటో తెలుసుకుందాం!       

About challaramaphani

An individual with a progressive attitude.
This entry was posted in Uncategorized and tagged , , , , , , , , , . Bookmark the permalink.

6 Responses to వ్యక్తిగత వికాసం నుండి వ్యక్తిత్వ వికాసం వైపు!

 1. చక్కని ప్రయత్నం. మీరు అన్ని పద్యాలని (లిసనింగ్, కమ్యునికేషన్, వగైరా) ఒక పోస్ట్ లో నే పెట్టారు. విడివిడిగా హెడ్ కొక పోస్ట్ పెట్టి, దానిని separate category and uncategorised categories కి లింక్ చేస్తే, ఉత్తరోత్తరా ఏ హెడ్ కి ఆ హెడ్ కాటగరీ వారీగా చూసుకోడానికి బాగుంటుందని నా చిన్న బుర్రకి అనిపించింది. your categories would be your data base for each head. it would help the readers to read all your great, greater, greatest collections on each head at one place that facilitate them to mend, modify and grow as a great personality on the lasting foot steps like Swami Vivekananda and other great masters…..

  All my praise and appreciations to you sir.
  May God bless you and provide opportunities to you to lay your hands on many hidden treasures.

  • వ్యక్తిత్వ వికాసంపై ప్రతి మహానుభావుడి కంట్రిబ్యూషన్ గురించి విడివిడిగా రాయాలని మీ భావం అనుకుంటాను. అదో పెద్ద గ్రంధం అవుతుంది. మంచి సలహా సార్! సాంకేతికంగా ఈ బ్లాగుల నిర్వహణలో నేనంత నిపుణుణ్ణి కాదు. నేర్చుకుంటున్నాను. మీ స్పందనకు ధన్యవాదాలు.

 2. Vanga Rajendra Prasad says:

  బాగు …బాగు..బ్లాగు బాగు

 3. malladi bharat kumar says:

  చాల బావుంది. వీటిని మనము పాటిస్తే తప్పకుండా విజయము సాధిస్తాము !!!! రామ్ గారికి ధన్యవాదములు !!!!!

 4. Lakshmi sundari koniki says:

  Phani garu I went thro all the points mentioned by u The way u explained was ver y very good and clear If these two ” soft— perso dev ” r introduced at secondary education level itself as a part of curriculum 80% 0f the students will be successful in achieving their goals in getting suitable jobs

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s